Thursday 22 March 2018

పెద్దిభట్టు

పూర్వం పెద్ది భట్టు అనే కవి పండితుడుండే వాడు?

ఆయనకున్న పేరు ప్రతిష్ఠలు చూచి అమాయకురాలైన భార్య సంతోషపడిపోయేది!

అందరి మీద పద్యాలు శ్లోకాలు చెప్పే భర్త తన మీద కూడా చెబితే బాగుంటుందని చాలా సార్లు భర్తను అడిగింది!ఆయన దాటవేస్తూ వచ్చాడు!

చివరకి ఆమె మీద ఒక శ్లోకం చెప్పక తప్పలేదాయనకి!

ఆ శ్లోకం చూడండి--ఆమె ఎంత అందగత్తెయో!


మేరు మంధర సమాన మధ్యమా!

తింత్రిణీ దళ విశాల లోచనా

అర్క శుష్క ఫల కోమల స్తనీ

పెద్ది భట్ట గృహిణీ విరాజితే!


తన భార్య ఎంత అందంగా విరాజిల్లుతుందో పెద్ది భట్టు

మొహమాటం లేకుండా చెప్పుకున్నాడు చూడండి?


ఆమె నడుము మేరు,మంధర పర్వతాలతో సమానమైనదట!


ఆమె కళ్లు చింతాకులంత విశాలమైనవట!


ఆమె స్తనాలు ఎండి పోయిన జిల్లేడు కాయల్లాగా వుంటాయట!

(ఎండు జిల్లేడు కాయలను చూచిన వారికే అది తెలుస్తుంది)


ఆమె పేరు మనకు తెలియక పోయినా పెద్ది భార్యది ఎంత అందమో!!!!

కదా!!!!

1 comment:

  1. పాపం, అమాయకురాలైన భార్య మీద అటువంటి పద్యం చెప్పడం - అన్యాయమండి.
    వెనకటికి ఒక బ్రిటిష్ కలెక్టర్ గారు తన దగ్గర పని చేస్తున్న వ్యక్తిని “నువ్వొక బుద్ధిలేని గాడిదవు” లాంటి తిట్టేదో ఆంగ్లంలో తిడితే, అర్థమవక “చిత్తం చిత్తం, తమబోటి పెద్దలంతా నన్నలాగే మెచ్చుకుంటున్నారయ్యా” అన్నాడట.

    ReplyDelete